శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Jan 30, 2020 , 01:33:23

రెండు గంటల వ్యవధిలో భార్య భర్తల మృతి

రెండు గంటల వ్యవధిలో భార్య భర్తల మృతి

భైంసా, నమస్తే తెలంగాణ : అనారోగ్యంతో భర్త, గుండెపోటుతో భార్య మృతి చెందిన సంఘటన నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని పంజేషా గల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భైంసా పట్టణంలోని పంజేషాగల్లికి చెందిన అబ్దుల్‌ అహద్‌(72) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. అతని భార్య హైమదీబేగం(68) సైతం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో రోదిస్తూ కుప్పకూలింది. కుటుంబీకులు స్థానిక ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరి కుమారులు ఇద్దరు ఇటీవల భైంసా అల్లర్ల ఘటనలో జైలుపాలయ్యారు. ఒక వైపు భర్త మరణం, మరోవైపు కొడుకులు జైలుపాలు కావడం జీర్ణించుకోలేని ఆ తల్లి గుండె  గంటల వ్యవధిలోనే ఆగిపోయింది. కొడుకులను బెయిల్‌పై రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


logo