మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Jan 29, 2020 , 00:07:18

గ్రీన్‌చాలెంజ్‌లో మొక్కలు నాటిన కలెక్టర్‌

గ్రీన్‌చాలెంజ్‌లో మొక్కలు నాటిన కలెక్టర్‌

నిర్మల్‌ టౌన్‌: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఎం.ప్రశాంతి మొక్కలను నాటారు. జగిత్యాల కలెక్టర్‌ నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌కు ఎం.ప్రశాంతికి గ్రీన్‌చాలెంజ్‌లో మొక్కలు నాటాలని చాలెంజ్‌ చేశారు. దీంతో ఆమె కలెక్టర్‌ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌కు, నిర్మల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి కి , ఖానాపూర్‌  ఎమ్మెల్యే రేఖశ్యాంనాయక్‌కు మొక్కలు నాటాలని గ్రీన్‌చాలెంజ్‌లో పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు గ్రీన్‌ చాలెంజ్‌ను ఎన్నుకోవడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన కలెక్టర్‌కు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కోఆర్డినేటర్‌ పురుషోత్తం ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయ అధికారులు అబ్దుల్‌ కలీం, డీపీఆర్వో కలీం, కళాకారులు నాగారాజు, సుదర్శన్‌, కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


logo
>>>>>>