శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Jan 29, 2020 , 00:02:17

గ్రామీణాభివృద్ధి పథకాలను వేగంగా చేపట్టాలి

గ్రామీణాభివృద్ధి పథకాలను వేగంగా చేపట్టాలి

నిర్మల్‌ టౌన్‌: పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కమిషనర్‌ రఘునందన్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాయంలో జరిగిన కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, డీపీవో శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌తో పాటు ఎంపీడీవోలు, డీఎల్‌పీవోలు హాజరయ్యారు. కమిషనర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పల్లె ప్రగతి, పల్లె ప్రణాళిక కార్యక్రమంలో గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం వచ్చిందని అదే స్ఫూర్తితో ప్రజలను పల్లెల పరిశుభ్రతపై దృష్టిసారించే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలకు అడిగిన వెంటనే పని కల్పించాలన్నారు. ఈసంవత్సరం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఉపాధిహామీ పనులను మార్చి 31లోపు పూర్తి చేయాలన్నారు. పల్లె ప్రగతికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నందున ప్రజా ప్రయోజన పనులను చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.logo