బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Jan 28, 2020 , 00:40:00

బాసరలో..‘పంచమి’ ఉత్సవాలు

బాసరలో..‘పంచమి’ ఉత్సవాలు
  • నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ
  • 30న వసంత పంచమి వేడుకలు

బాసర: నిర్మల్‌ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వసంత పంచమి ఉత్సవాలు నిర్వహించనున్నారు.మంగళ, బుధ, గురువారాల్లో జరిగే ఈ ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తులు తమ చిన్నారులకు అమ్మవారి చెంత అక్షరశ్రీకార పూజలు జరిపించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  గురువారం వసంత పంచమి రోజున భక్తులకు తాగునీరు, చిన్నారుల కోసం పాలు, బిస్కెట్లు పంపిణీ చేయనున్నారు.


నేటి పూజలు..

శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం 4గంటలకు మంగళ వాయిద్యం, సుప్రభాత సేవ, ప్రత్యేక అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8గంటల నుంచి వేద పఠనం, మహావిద హోమం సంకల్పం, పుణ్యహవచనం,  అగ్ని స్థాపన, మండపారాధన, సాయంత్రం 6.30గంటలకు మహాపూజను అర్చకులు నిర్వహించనున్నారు.


వచ్చే నెల 4న హుండీ ఆదాయం లెక్కింపు

శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలోని హుండీ కానుకలను ఫిబ్రవరి 4వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయన ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9గంటలకు హుండీలను అధికారుల సమక్షంలో విప్పనున్నట్లు పేర్కొన్నారు. లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. లెక్కింపులో బ్యాంకు, పోలీసు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొంటారని తెలిపారు.


logo