శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Jan 28, 2020 , 02:19:01

ఆదర్శ నిర్మల్‌గా తీర్చిదిద్దుతా..

ఆదర్శ నిర్మల్‌గా తీర్చిదిద్దుతా..

నిర్మల్‌ టౌన్‌/నిర్మల్‌ అర్బన్‌: నిర్మల్‌ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పట్టణ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం మున్సిపల్‌ నూతన కార్యవర్గం కొలువుదీరగా, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జిల్లాకేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన పట్టణ ప్రజలకు అభివృద్ధి చేసి రుణాన్ని తీసుకునే అవకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 42 స్థానాలకుగాను 30స్థానాలను దక్కించుకొని గులాబీ జెండా ఎగురవేసిందన్నారు. నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా గండ్రత్‌ ఈశ్వర్‌, వైస్‌ చైర్మన్‌ను ఎస్‌.కే. సాజిద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని ఆ తర్వాత పట్టణంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరేవరుస్తామని హామీ ఇచ్చారు.

కొత్త పాలకవర్గానికి అభినందనల వెల్లువ..

నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా గండ్రత్‌ ఈశ్వర్‌, వైస్‌ చైర్మన్‌గా ఎస్‌.కే.సాయుద్‌లను ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఎన్నికైన సభ్యులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట విజయోత్సవ సభను నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి జిల్లాలోని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూలమాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఎఫ్‌సీఎస్‌ ఛైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణగౌడ్‌, పట్టణాధ్యక్షులు మారుగొండ రాము, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, అల్లో కుటుంబసభ్యులు గౌతంరెడ్డి , దివ్యారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo