బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Jan 28, 2020 , 00:36:15

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

నిర్మల్‌ టౌన్‌: జిల్లాలో రోడ్డు ప్రమాదాల  నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎం.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌  కార్యాలయంలో సోమవారం రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోని ప్రణాళికబద్ధంగా నివారణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా  ఆయా రహదారులపై జరుగుతున్న  ప్రమాదాల వివరాలను రవాణాశాఖ అధికారులు సమావేశంలో కలెక్టర్‌కు వివరించారు. భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రహదారి పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, రోడ్లపై ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. నిరంతరంగా రవాణాశాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 2వ తేది వరకు జిల్లాలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నందున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో 20వేల రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 6వేల మంది మరణిస్తున్నారని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాలో 2019లో 38 ప్రమాదాలు జరిగాయని, ఇందులో 42మంది మృతి చెందారని తెలిపారు. ఈసందర్భంగా రోడ్డు  భధ్రత పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఎస్పీ శశిధర్‌రాజు, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాస్‌రావు, డిపో మేనేజర్‌ ఆంజనేయులు, రవాణాశాఖ అధికారి అజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>