మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Jan 28, 2020 , 00:28:12

హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలి

హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలి


సోన్‌/లక్ష్మణచాంద/దిలావర్‌పూర్‌/ సారంగా పూర్‌: హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలని వివిధ మండలాల ఎస్సైలు వాహనదారులకు సూచించారు. సోమవారం సోన్‌, లక్ష్మణచాంద, మామడ, దిలావర్‌పూర్‌లో ఎస్సైలు రవీందర్‌, వినయ్‌, జీవన్‌రెడ్డి, సజీవ్‌  తనిఖీలు నిర్వహిం చారు. సోన్‌ మండలంలోని గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద , లక్ష్మణచాందలో ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులు హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలని కోరుతూ గులాబీ పువ్వులను అందజేశారు. కార్యక్రమంలో సోన్‌ ఏఎస్సై నారాయణరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. లక్ష్మణ చాంద మండలంలోని ధర్మారం గ్రామం లో కానిస్టేబుళ్లు గణపతి, సంతోష్‌ డయల్‌ 100పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 100 నంబరుకు డయల్‌ చేయాలని సూచించారు. దిలావర్‌పూర్‌ మండలంలోని నిర్మల్‌-భైంసా 61వ జాతీయరహదారిపై హెల్మెట్‌ వాడకం గురించి ఎస్సై అవగాహన కల్పించారు. అనంతరం హెల్మెట్‌ ధరించి మోటార్‌ సైకిల్‌ నడిపిన వారికి స్వీటు ఇచ్చి అభినందించారు. నర్సాపూర్‌(జీ) ఎస్‌ఐ రమణ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వాహనదారులకు అవగాహన కల్పించారు. సారంగాపూర్‌ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హెల్మెట్‌ వినియోగంపై ఎస్సై రాంనర్సింహరెడ్డి అవగాహన కల్పించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. హెచ్‌ఎం విద్యాసాగర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


logo
>>>>>>