గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 28, 2020 , 02:20:00

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

గణతంత్ర దినోత్స వేడుకలు అంబరాన్నంటాయి. భైంసా ఏరి యా దవాఖాన ఆవరణలో సూపరింటెండెంట్‌ కాశీనాథ్‌, ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో రాజు, ఆయా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో తహసీల్దార్‌ నర్సయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌, డీఎస్పీ  నర్సింగ్‌రావు, మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య, న్యాయవాదులు, సి. శంకర్‌, ప్రసన్నజిత్‌ అగ్రే, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు కృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేదం, వాసవి, శ్రీచైతన్య, విజేత, శ్రీ సరస్వతీ శిశుమందిర్‌, వాసవి, వివేకానంద, శ్రీమేథ, ఆశ్రమ, గౌతమి, శ్రీ సరస్వతీ శిశుమందిర్‌ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. 

భైంసా మండలంలోని చింతల్‌బోరి, కుంసర, బిజ్జూర్‌, వానల్‌పాడ్‌, గుండెగాం, మిర్జాపూర్‌ తదితర గ్రామాల్లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్‌, ఐకేపీ, విద్యానరుల కేంద్రం ఆవరణలో ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో ఎంపీపీ కల్పన జాదవ్‌, ఎంపీడీవో గోపాలకృష్ణరెడ్డి, వైస్‌ ఎంపీపీ గంగాధర్‌, డీఎల్పీవో శివకృష్ణ, ఈవోపీఆర్డీ హుస్సేన్‌, సర్పంచులు రాజు, మాధాబాయి, రాజన్న, ఎంపీటీసీ మాణిక్‌రావు, కో ఆప్షన్‌ సభ్యులు గజానంద్‌, నాయకులు రాంకుమార్‌, గణేశ్‌ పటేల్‌, చంద్రకాంత్‌, తదితరులు పాల్గొన్నారు. 

కుభీర్‌ మండలకేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ధార్‌కుభీర్‌  ప్రాథమిక పాఠశాలకు సర్పంచ్‌ సాగర రూ.15వేలు  విలువ చేసే టీవీని అందజేశారు. ఫకీరానాయక్‌ తండాలో సర్పంచ్‌ అశ్విని పండిత్‌ జాదవ్‌ ప్లేట్లు, పెన్నులు, పుస్తకాలు అందజేశారు. తహసీల్దార్‌ డి.రాజ్‌మోహన్‌, ఎంపీపీ తూం లక్ష్మి జాతీయ జెండాను ఎగురవేశారు. సర్పంచ్‌ మీరా విజయ్‌కుమార్‌, ఎస్సై లక్కంపెల్లి ప్రదీప్‌, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు న్యాలపట్ల దత్త్తుగౌడ్‌ సాంగ్విలో జెండాను ఎగురవేశారు. 

లోకేశ్వరం తహసీల్దార్‌ వెంకటరమణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ చిన్నారావు, ఎస్సై ఎండీ యాసిర్‌ అరాఫత్‌, ఎంపీడీవో గంగాధర్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ తుకారాం, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రమేశ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ అధికారి గణేశ్‌, పశువైద్యాధికారిణి జెస్సి, పీహెచ్‌సీ వైద్యురాలు హారిక, గ్రంథాలయ ఇన్‌చార్జి సదాశివరావు, కస్తూ ర్బా పాఠశాల ప్రిన్సిపాల్‌ అనసూ య, ఐకేపీ ఏపీఎం గంగారెడ్డి తదితరులు జెండాను ఆవిష్కరించారు. కుంటాల తహసీల్దార్‌ నలందప్రియ, ఎస్సై శ్రీకాంత్‌, ఎంపీపీ అప్క గజ్జారాం, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు జాతీ జెండాను ఆవిష్కరించారు.

తానూర్‌ మండల కేంద్రంలో సర్పంచ్‌ తాడేవార్‌ విఠల్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ సత్యనారాయణ, ఎస్సై గుడిపెల్లి రాజన్న, ఎంపీపీ మంజుల, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, ఆత్మ చైర్మన్‌ పోతారెడ్డి, పశువైద్యశాలలో గోపాల్‌మహాజన్‌, పీహెచ్‌సీలో డాక్టర్‌ సుభాష్‌, హంగిర్గా సొసైటీ కార్యాలయంలో చైర్మన్‌ నారాయణ్‌రావుపటేల్‌, ఎపీ ఎం సులోచన తదితరులు జాతీ జెండాను ఎగురవేశా రు. ముథోల్‌ మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో జాయతీజెండాను ఎగురవేశారు. మండల కేంద్రంలో సర్పంచ్‌ రాజేందర్‌, ఎంపీపీ అయేషా కనీస్‌, ఏడీఏ అంజిప్రసాద్‌, సీఐ అజయ్‌బాబు, తహసీల్దార్‌ లోకేశ్వర్‌రావు, చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు దప్కల్‌ సాయి,  పంచాయతీ రాజ్‌ డీఈ రాధాకృష్ణ, ఎంఈవో మైసాజీ, సీడీపీవో శ్రీమతి, అక్షరపాఠశాలలో డైరెక్టర్‌ సూభాష్‌, రబీంద్ర పాఠశాలలో ప్రిన్సిపాల్‌ సాయినాథ్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, వ్యవసాయ పరిశోధన స్థ్ధానంలో విజయకుమార్‌ జెండా ఎగురవేశారు. ఆష్ట గ్రామంలోభాష్య స్కూల్‌ విద్యార్థులు 150 మీటర్ల జెండాతో ర్యాలీ నిర్వహించారు. 


logo