శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Jan 27, 2020 ,

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పల్లెకు చేరి ప్రజలందరూ అభివృద్ధి బాటలో పయనించాలని కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో నిర్వహించిన రిపబ్లిక్‌ వేడుకల్లో కలెక్టర్‌ పాల్గొని ప్రసంగించారు.దేశానికి పల్లెలె పట్టుకొమ్మలు అని భావించిన ప్రభుత్వం జిల్లాలో 396 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రగతి, పల్లె ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాలను పరిశుభ్రం చేయడం, మౌలిక వసతులను కల్పించినట్లు తెలిపారు. ప్రతి పల్లెలో హరితహారంలో మొక్కలు నాటడం, ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు.


నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్‌బెడ్‌రూం పథకం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 2636 ఇండ్ల నిర్మాణానికి ఆమోదం తెలుపగా.. 678గృహాలు పూర్తి చేశామని తెలిపారు. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకం కింద ఒక్కొక్కరికి రూ. లక్ష 116 చొప్పున కల్యాణలక్ష్మికి 4840, షాదీముబారక్‌ 1867మందికి అందించామన్నారు. జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. జిల్లాలో 60,136 మంది విద్యార్థులకు సన్నరకం బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామన్నారు. షెడ్యూల్‌కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ. 2.50లక్షలను ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు.  ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా జిల్లాలో 2019లో వందశాతం సబ్సిడీతో 427మంది లబ్ధిదారులకు 1108ఎకరాలను కొనుగోలు చేశామన్నారు.ఇందుకు 48కోట్ల38లక్షల79వేలను ఖర్చు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గిరిజనాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు అన్ని విధాల చేయూతను అందిస్తున్నామన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2019-20 సంవత్సరానికిగాను 8819మంది బీసీ విద్యార్థులకుగాను రూ. 2కోట్ల 76లక్షల పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాలను అందించడం జరిగిందన్నారు. 6420మందికి బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 2కోట్ల67లక్షల494మందికి పంపిణీ చేయడం జరిగిందన్నారు. 


క్రిస్మస్‌, రంజాన్‌ పండుగలకు గిఫ్ట్‌లు

జిల్లాలో మైనారీ సంక్షేమశాఖ ద్వారా క్రిస్మస్‌, రంజాన్‌ వేడుకలకు ప్రత్యేక గిప్టు ప్యాకెట్లను అందించడం జరిగిందన్నారు. జిల్లా మహిళా దివ్యాంగుల వయోవృద్దుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలోఅమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందిస్తున్నామని, దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశామన్నారు.జిల్లాలో వ్యవసాయ రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. 2019-20 సంవత్సరానికిగాను రైతుల వద్ద నుంచి రూ.5లక్షల 45వేల505క్వింటాళ్ల పత్తిని 1,30,743మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని, 91,430 క్వింటాళ్ల సోయబీన్‌ను, 44,804క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పశు సంవర్ధశాఖ ఆధ్వర్యంలో 75శాతం సబ్సిడీపై 6770 గొర్రెకాపరులకు సబ్సిడీ గొర్రెలను అందించామన్నారు. పశువుల టీకాలతో పాటు పాడి పరిశ్రమను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకంటుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 757పాడిగేదెలను లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. 


3.97కోట్ల చేప పిల్లల విడుదల

జిల్లాలో వందశాతం సబ్సిడీపై చెరువుల, రిజర్వాయర్లలో 3కోట్ల 97లక్షల చేప పిల్లలను 570 చెరువుల్లో వేయడం జరిగిందన్నారు. 82లక్షల రొయ్య పిల్లలను శ్రీరాంసాగర్‌, గడ్డెన్నవాగు ప్రాజెక్టులో విడుదల చేయడం జరిగిందన్నారు. సారంగాపూర్‌ మండల కేంద్రంలో 50లక్షలతో చేపల మార్కెట్‌ మంజూరైందన్నారు. ఉద్యానవనశాఖ పట్టుపరిశ్రమశాఖ ఆధ్వర్యంలో 6094 మంది రైతులకు రూ. 9కోట్ల52లక్షల విలువ చేసే బిందు సేద్యం పరికారాలను బిగించినట్లు తెలిపారు. జిల్లాలో అర్హులైన పేదలందరీకీ రేషన్‌ సరుకులను అందించేందుకు పౌర సరఫరాశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది 14 8 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షా 30వేల 743 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 240కోట్లను రైతు ఖాతాల్లో జమ చేశామన్నారు. జిల్లాలో 390 రేషన్‌ షాపుల్లో ఈ-పాస్‌ విధానం ద్వారా నిత్యావసర సరుకులను పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. 

తెలంగాణ హరిత హారంలో భాగంగా జిల్లాలో డీఆర్డీఏ, అటవీశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 2కోట్ల 10లక్షల మొక్కలు నాటాలని లక్ష్య ంగా నిర్దేశించుకోగా.. కోటీ 8లక్షల 424 మొక్కలను నాటినట్లు తెలిపారు. కోటీ 47లక్షలతో గండిరామన్న హరితవనాన్ని ఏర్పాటు చేయడంతో 7లక్షల 39వేల రెవెన్యూ ఆదాయం వచ్చిందన్నారు. ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కంటి వెలుగు పథకం ద్వారా జిల్లాలో 3లక్షల70వేల 559 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 60,490మందికి కంటి అద్దాలను అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు చేసుకునే వారికి అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా 10,767మందికి లబ్ధి చేకూర్చిందన్నారు. ముజ్గి పీహెచ్‌సీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. పంచాయతీ, ఇంజినీర్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 658లక్షలతో ఆరు వంతెన నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా 2633లక్షలతో 78గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. అంగన్వాడీ భవనాలతో పాటు మహిళా సమైక్యా భవనాలు,  వ్యవసాయ గోదాముల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

 

సుందర పట్టణంగా నిర్మల్‌ 

నిర్మల్‌ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో 40కోట్లతో ఐదు జంక్షన్లలో వాటర్‌ ఫౌంటేషన్‌ పనులతో పాటు సుందరీకరణ, స్వాగత తోరణం, పార్కుల నిర్మాణం, శ్యాంగడ్‌ పనుల అభివృద్ధి, ధర్మసాగర్‌, కంచెరోని కట్ట చెరువుల్లో వాక్‌ంగి ట్రాక్‌, సెంట్రల్‌ లైటింగ్‌, బైల్‌బజార్‌లో కొత్త మార్కెట్‌ వంటి పనులను చేపట్టడం జరిగిందన్నారు.  జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అనేక నిధులను సమకూరుస్తున్నదని వాటిని ప్రజా ప్రాధాన్యత పనుల అవసరాలకు విడుదల చేయడం జరుగుతుందన్నారు. 


1,25,327మంది రైతులకు రైతుబంధు

జిల్లాలో రైతుబంధు పథకం కింద 1,25,327మంది రైతులకు రూ. 161కోట్లను మంజూరు చేశారని తెలిపారు. రైతుబీమా పథకం ద్వారా 160మంది రైతులకు రూ.5లక్షల చొప్పున బీమా సౌకర్యాన్ని అందించామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 1,45,448 పింఛన్‌దారులకు రూ.31కోట్ల75లక్షల21వేలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఉపాధిహామీలో 52లక్షల 27వేల పని దినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 48లక్షల22వేల పనిదినాలను కల్పించామన్నారు. సంపూర్ణ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 98 శాతాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా 2818 సంఘాలకు రూ. 102కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. 


logo