మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Jan 27, 2020 , 00:41:07

పల్లె ప్రగతి అధికారులకు ప్రోత్సహకాలు అందజేత

పల్లె ప్రగతి అధికారులకు ప్రోత్సహకాలు అందజేత

దిలావర్‌పూర్‌: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతం చేయడంతో ప్రతిభ కనబర్చిన ఇద్దరు ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మండల పరిషత్‌ అధికారులు ప్రోత్సహకాలను అందజేశారు. ఆదివారం గణ తంత్ర వేడుకల సందర్భంగా న్యూ లోలం ఫీల్డ్‌ అసిస్టెంటు గోవిందుల మహేశ్‌, కాల్వ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రవికి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ, తహసీల్దార్‌, ఎంపీడీవో ఇతర ప్రజాప్రతినిధులు కలిసి నగదును అందజేసి అభినందించారు. పల్లె ప్రగతిలో పచ్చదనం పెంచడంలో ప్రతిభను చూపినందుకు వీరిని ఎంపిక చేసినట్లు ఏపీవోజగన్నాథం పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ అమృత, తహసీల్ధార్‌ సంతోష్‌రెడ్డి, ఎంపీడీవో మోహన్‌రెడ్డి మండల ఉపాధ్యక్షుడు బాబురావు, ఎంపీటీసీలు అక్షర, అనిల్‌, మండలకోఆప్షన్‌ సభ్యుడు అన్వర్‌ఖాన్‌ పాల్గొన్నారు. 


logo
>>>>>>