బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Jan 26, 2020 , 02:07:52

సమష్టి కృషితోనే ఎన్నికలు విజయవంతం

సమష్టి కృషితోనే ఎన్నికలు విజయవంతంనిర్మల్‌ టౌన్‌: జిల్లాలోని నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపాలిటీల్లో  ఎన్నికలు అందరి సమష్టి కృషితోనే విజయవంతమయ్యాయని దీనికి సహకరించిన ఉద్యోగులకు, రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కలెక్టర్‌ ఎం.ప్రశాంతి, ఎస్పీ శశిధర్‌రాజు పేర్కొన్నారు. ఈ నెల 7న ప్రారంభమైన మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ శనివారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌తో పూర్తయిందని తెలిపారు. మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్నిశాఖల సమన్వయంతో కృషి చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఓటింగ్‌శాతం కూడా పెంచేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయని తెలిపారు. నిర్మల్‌ మున్సిపల్‌ కౌంటింగ్‌ నిర్వహించగా.. కౌంటింగ్‌ కేంద్రాలను ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు శృతిఓజా కౌంటింగ్‌కేంద్రాలను పరిశీలించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అభ్యర్థులకు ధ్రువీకరణపత్రాల అందజేత..

నిర్మల్‌ మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో గెలుపొందిన అభ్యర్థులకు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు ఎన్నిక ధ్రువీకరణపత్రాలను అందించారు. 30మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో పాటు ఏడుగురు  కాంగ్రెస్‌, ఒక బీజేపీ, ఇద్దరు ఎంఐఎం, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ధ్రువీకరణపత్రాలను అందించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ డీఈ సంతోష్‌, ప్రత్యేకాధికారులు శ్రీనివాస్‌, కిషన్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

సమావేశాలపై నోటీసులు అందజేత..

నిర్మల్‌ మున్సిపాలిటీలో  కొత్తగా ఎన్నికైన కౌన్సిల్‌ సభ్యులకు ఈనెల 27న తొలి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో నిర్మల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు సమావేశానికి ప్రతి సభ్యుడు హాజరుకావాలని కోరుతూ శనివారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. గెలుపొందిన 42 మంది సభ్యులకు నోటీసులను అందించి ఈనెల 27న ఉదయం 11గంటలకు మున్సిపల్‌ సమావేశానికి రావాలని సూచించారు. 
logo
>>>>>>