బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Jan 25, 2020 , 01:04:40

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
  • -పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, జేసీ
  • -నిర్మల్‌ కౌంటింగ్‌ టేబుళ్ల సంఖ్య పెంపు

నిర్మల్‌ టౌన్‌: మున్సిపల్‌ ఓట్ల లెక్కింపును పకడ్బందీగా  నిర్వహించాలని కలెక్టర్‌ ఎం.ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావు జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను వారు శుక్రవారం పరిశీలించారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాన్ని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించి రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నామని వెల్లడించారు. నిర్మల్‌ మున్సిపాలిటీలో 40 వార్డులకు 20టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. రెండు రౌండ్లలోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. భైంసాలో 23వార్డులకు 12 టేబుళ్ల ఏర్పాటు చేయగా.. ఖానాపూర్‌లో 12వార్డులకు ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు  చేశామని పేర్కొన్నారు. పోలింగ్‌ల్లో విధులు నిర్వహించే సిబ్బంది, పోలింగ్‌ ఏజెంట్లు, పార్టీ అభ్యర్థులు, మీడియా పాత్రికేయులకు అనుమతి మాత్రమే ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం నియమించబడిన సిబ్బంది, ఇతర సిబ్బంది శనివారం ఉదయం 6.30 నిమిషాలకు కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపునకు అవసరం అయ్యే టేబుల్స్‌, మిక్స్‌డ్‌ డ్రమ్స్‌, కంప్యూటర్‌లు తదితర వస్తువులు సిద్ధం చేశామన్నారు.

కార్యక్రమంలో ఆర్డీవోలు ప్రసునాంబ, రాజు, మున్సిపల్‌ కమిషనర్లు వెంకటేశ్వర్లు, కదీర్‌, ఈ-డిస్ట్రిక్‌ మేనేజర్‌ నదీంఖాన్‌, ఎంపీడీవో మోహన్‌, గంగాధర్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల మార్గదర్శకాలను పాటించాలి: అన్ని జిల్లాల్లో నిర్వహించే మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని మున్సిపల్‌శాఖ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ శ్రీదేవి మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌  నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె మాట్లాడారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని, ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీసీలో మున్సిపల్‌  కమిషనర్‌ వెంకటేశ్వర్లు, అధికారులు సుమలత, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>