శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Jan 25, 2020 , 01:04:40

పరిసరాలను శుభ్రం చేసిన ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు

 పరిసరాలను శుభ్రం చేసిన ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు


సోన్‌: పట్టణంలోని చాణక్య డిగ్రీ కళాశాలకు చెందిన  ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు రెండో రోజు శీతాకాల శిబిరంలో భాగంగా  జాఫ్రాపూర్‌లో పరిసరాలను శుభ్రం చేశారు.  ప్రాథమిక పాఠశాల ఆవరణలో మురికి కాలువల కోసం తవ్వకాలు, హరితహారంలో మొక్కలను నాటారు. ప్రిన్సిపాల్‌ జనార్దన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు  శ్యామల, నాయకులు హరీశ్‌రెడ్డి, ప్రకాశ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త శేఖర్‌, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్‌ మండలంలోని వెంగ్వాపేట్‌ గ్రామంలో వారం రోజులుగా చేపడుతున్న ఎస్‌ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం శుక్రవారం ముగిసింది. సేవా కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నరహరి, నిర్వాహకులు తిరుపతిరావు, వెంకటేశ్వర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.logo