మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Jan 25, 2020 , 01:02:47

మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

 మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి


నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ: పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏదైనా  సమస్యలతో వచ్చే మహిళల పట్ల సానుకూలంగా స్పందించాలని  ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల రిసెప్షనిస్టులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2020 ఏడాదిని రోడ్డు, మహిళల భద్రత సంవత్సరంగా ప్రకటించారని తెపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి పోలీసుస్టేషన్‌కు వచ్చే వారిని వెంటనే దవాఖానకు తరలించి వెంటనే చికిత్స అందేలా చూడాలని సూచించారు. ప్రతి వారం ఫిర్యాదు దారులకు వారి కేసులకు సంబంధించిన వివరాలు చెప్పాలని ఆదేశించారు. రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ రెడ్డి, ఐటీ కోర్‌ ఇన్‌చార్జి మురాద్‌ అలీ పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లు

లక్ష్మణచాంద:  ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక డ్రైవ్‌లు  చేపడుతున్నట్లు ఎస్పీ శశిధర్‌ రాజు తెలిపారు.  శుక్రవారం ఆయన రోడ్డు భద్ర తా కార్యక్రమంలో భాగం గా నిర్మల్‌ - ఖానాపూర్‌ జాతీయ రహదారిపై మండలంలోని కనకాపూర్‌, బోరి గాం, బాబాపూర్‌ ఎక్స్‌రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు రహదారులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్‌అండ్‌బీ, పోలీసు అధికారులకు సూచించారు. ప్రయాణికులు రోడ్డును గమనించేలా సైన్‌ బోర్డులు, రేడియం స్టిక్కర్స్‌, బార్డర్లను ఏర్పాటు చేయాలన్నారు. నెలరోజుల్లో రహదారిపై గుర్తులను ఏర్పాటుచేస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై వినయ్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాస రావు, డీఈ బాపురెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


logo
>>>>>>