శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Jan 24, 2020 , 02:01:29

ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు

ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు
  • -నిర్మల్‌ కౌంటింగ్‌కు 14, ఖానాపూర్‌కు 6, భైంసాకు 12 టేబుళ్ల ఏర్పాటు
  • -కౌంటింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలి : జేసీ

నిర్మల్‌టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో ఎన్నికల కౌంటింగ్‌పై కౌంటింగ్‌ సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బందితో గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 25న నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాల్టీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని పాల్‌టెక్నిక్‌ కళాశాలలో జరుగుతుందన్నారు. నిర్మల్‌ మున్సిపాల్టీలో 40 వార్డులకు 14 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భైంసాలో 23 వార్డుల ఎన్నికలకు 12 టేబుళ్లు, ఖానాపూర్‌లో 12 వార్డులకు ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని, లెక్కింపులో వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. లెక్కింపులో పాల్గొనే అధికారులు టేబుల్‌ మిక్సింగ్‌ డ్రమ్ములు, సర్టిఫికెట్లు, డ్రమ్ములు, ఇతర వస్తువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలను కల్పించి ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీవోలు అజయ్‌కుమార్‌రెడ్డి, ప్రసూనాంబ, మున్సిపల్‌ కమిషనర్‌లు వెంకటేశ్వర్లు, మల్లేశం, మహ్మద్‌ఖాదీర్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు.logo