ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Jan 22, 2020 , 04:35:48

బాధిత మహిళలకు అండ ‘సఖి’

బాధిత మహిళలకు అండ ‘సఖి’


కడెం : శారీరక, మానసిక హింసకు గురైన మహిళలకు సఖి కొండంత అండగా నిలుస్తుందని సఖి కేంద్రం వన్ కన్వీనర్ కవితారాణి అన్నారు. మండలకేంద్రంలోని జడ్పీ పాఠశాల విద్యార్థులతో పాటు మహిళలకు సఖి సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ కవితారాణి మాట్లాడుతూ మానసి, శారీరక హింసకు గురైన బాధిత మహిళకు సఖి  అండగా నిలుస్తుందన్నారు. శారీరక గాయాలైన వారికి ఉచిత వైద్యసేవలతో పాటు రక్షణ కల్పిస్తూ భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. బాధిత మహిళలు జిల్లాకేంద్రంలోని సఖి కేంద్రానికి వచ్చే పరిస్థితి లేనిపక్షంలో ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే వాహన సదుపాయాన్ని కల్పిస్తామని అన్నారు. నిరాదారణకు గురైన మహిళలకు తాత్కాలికంగా ఐదు రోజుల పాటు వసతి కల్పించడం జరుగుతుందన్నారు.

మహిళలకు కేసుల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తే జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ సహకారంతో ఎఫ్ ఆధారంగా న్యాయపరమైన సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. పోలీసుల సహకారంతో దోషులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 365 రోజుల పాటు 24 గంటలూ బాధిత మహిళలకు, బాలికలకు సఖి కేంద్రం అండగా ఉంటుందని, సఖి సేవలను వియోగించుకోవాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాలకు 85005 40181 నంబర్ సంప్రదించాలని, లేదా కార్యాలయ టోల్ నంబర్ 181 ద్వారా సహాయం పొందే అవకాశం ఉందన్నారు. అనంతరం సఖి కేంద్రానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కే.అనూష, సఖి కేంద్రం నిర్వాహకులు రోహిణి, పారామెడికల్ అసిస్టెంట్ భూమా, పాఠశాల విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.logo