మంగళవారం 07 ఏప్రిల్ 2020
Nirmal - Jan 22, 2020 , 04:34:48

సీసీఐ కేంద్రాల ద్వారా 85 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు

సీసీఐ కేంద్రాల ద్వారా 85 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు


బోథ్, నమస్తే తెలంగాణ : వరంగల్ రీజియన్ పరిధిలోని 65 మార్కెట్ కమిటీల్లోని 178 సీసీఐ కేంద్రాల ద్వారా  85.84 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశామని మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడించారు. వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్  మల్లేశంతో కలిసి బోథ్ మార్కెట్ కమిటీ పరిధిలోని జిన్నింగు మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో చేపడుతున్న పత్తి కొనుగోళ్లను మంగళవారం పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,68,200ల మంది రైతులకు చెందిన 85,84,564 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసిందన్నారు. ప్రైవేటు వ్యాపారులు 24,71,658 క్వింటాళ్లు కొన్నట్లు చెప్పారు.

అత్యధికంగా నల్గొండ జిల్లాలో 20 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా ఆదిలాబాద్ జిల్లాలో 17,64,350 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. సీసీఐ ఆధ్వర్యంలో చేపడుతున్న పత్తి కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు రావడంలో ఆలస్యమవుతున్నందున మూడు రోజుల్లోగా రైతుల ఖాతాల్లో పడేలా చూడాలని అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఆయన వెంట బోథ్ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి ఎన్ మనోహర్, సిబ్బంది ఉన్నారు.


logo