శనివారం 28 మార్చి 2020
Nirmal - Jan 20, 2020 , 23:50:57

అభివృద్ధి సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

అభివృద్ధి సంక్షేమమే  టీఆర్‌ఎస్‌ ధ్యేయంనిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ:

అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీ, విశ్వనాథ్‌పేట్‌, గాజులపేట్‌, బైల్‌బజార్‌, పంచశీల్‌ కాలేజీ, ప్రియదర్శినినగర్‌, బస్టాండు, బర్కతుపుర, గాంధీనగర్‌, కబూతర్‌ కమాన్‌,మదీన కాలని, ఇందిరానగర్‌ కాలనీల్లో మంత్రి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ప్రచారానికి వచ్చిన మంత్రికి స్థానిక మహిళలు మంగళహారతులు,బాజాభజంత్రీలతో స్వాగతం పలికారు.ఈ  సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్‌ పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనబడుతోందన్నారు. ఇందుకు నిదర్శనం పట్టణంలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రహదారుల విస్తరణ,సెంట్రల్‌ లైటింగ్‌ పనులే అన్నారు. కుల సంఘాలకు భవన నిర్మాణాలు, ఆలయాలకు నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతుండడంతో ప్రజలంతా సంతోషంతో ఉన్నారన్నారు. ప్రజల అవసరాలను గ్రహించిన సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తూ అందరికి పెద్ద దిక్కులా ఉన్నారన్నారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీనే ఆదరిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపుతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆదరణ పెరగడంతో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకడుగు వేశారన్నారు. అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసి మున్సిపల్‌ బల్దియా పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గండ్రత్‌ ఈశ్వర్‌, ఎఫ్‌సీఎస్‌ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్‌, భూషణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ధర్మాజిగారి రాజేందర్‌, ఆయా వార్డుల టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఉన్నారు.logo