శనివారం 28 మార్చి 2020
Nirmal - Jan 20, 2020 , 23:45:39

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

 అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి


నిజామాబాద్‌ జడ్పీచైర్మన్‌  దాదాన్నగారి విఠల్‌రావు
భైంసా, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం ఐదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చూసి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి,  నిజామాబాద్‌ జడ్పీచైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు కోరారు.సోమవారం భైంసా పట్టణంలోని పలు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపిస్తే, పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలుపుతూ మ్యానిఫెస్టోను సైతం విడుదల చేశామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటు వేస్తే.. అభివృద్ధిని అడ్డుకున్నవారవుతారని పేర్కొన్నారు. పేదలను ఉన్నతస్థాయికి తీసుకుపోవడమే లక్ష్యంగా ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. గత పాలకుల హయాంలో నెలకొన్న ఇబ్బందులను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని కాలనీల్లో తాగునీటి వసతితో పాటు అభివృద్ధి పనులు కళ్లముందు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రచారంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు హల్ద రాజలింగు, తోట రాము, ఎజాజ్‌ హైమద్‌, ఫారూఖ్‌, విలాస్‌ గాదేవార్‌, భోజరాం, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులున్నారు.



logo