గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 20, 2020 , 03:00:29

టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి

టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలిభైంసా, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పట్టణంలోని 15,19 వార్డుల్లో ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐదేండ్లలో టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని చూసి మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి పట్టం కట్టాలని కోరారు. భైంసా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, మరింత అభివృద్ధి చేందాలంటే.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులను సరళీకృతం చేస్తామని అన్నారు. కొత్త లేఔట్లు ఏర్పాటు చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అనుమతులు ఇస్తామని తెలిపారు. పట్టణంలో రూ. 2.5 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియాన్ని ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని చెప్పారు. రైతుబజార్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే పట్టణంలో 400 బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. ఉర్దూ స్టడీ సర్కిల్‌ అధునీకరిస్తామని తెలిపారు.నిర్మల్‌ చౌరస్తా నుంచి పోస్టాఫీసు వరకు రోడ్డును అభివృద్ధి చేస్తానని అన్నారు. ఓవైసీ నగర్‌లో రూ. 20 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.  నాయకులు బామ్ని రాజన్న, సాంవ్లీ రమేశ్‌, హల్ద రాజలింగు, రాఫే, ఎజాజ్‌హైమద్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తదితరులున్నారు.logo