నేడు పల్స్‌పోలియో

నిర్మల్ అర్బన్,నమస్తే తెలంగాణ: జిల్లాలో ఆదివాం పల్స్పోలియోనిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా వైద్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో నివారణ వ్యాక్సిన్లను వేయనున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రా లు, బస్ స్టాండ్లు, దవాఖానలు ఇతర చోట్ల చుక్కల మందు వేయనున్నారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా వైద్యశాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లాలో మూడు రోజుల పాటు చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్యశాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో ఐదేండ్లలోపు చిన్నారులు 91,957 మంది ఉండగా, వీరందరికీ చుక్కల మందు వేయనున్నారు.ఇందుకోసం జిల్లాలో 644 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 110 కేంద్రాలు అర్బన్ ఏరియాలో, 553 గ్రామీణ ప్రాంతాల్లో, 20 మోబైల్ టీంలు, 19 ట్రాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి పోలింగ్ కేంద్రానికి నలుగురు చొప్పున మొత్తం 2576 మంది సిబ్బందిని నియమించారు.105 మంది సూపర్ వైజర్లు పల్స్‌పోలియో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించనున్నారు.
రేపు,ఎల్లుండి ఇంటింటా పల్స్‌పోలియో
జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియా కార్యక్రమాన్ని నేడు ప్రారంభించగా పోలియో చుక్కలు వేసుకోని చిన్నారుల కోసం ఈ నెల 20,21 తేదీలలో నిర్వహించనున్నారు. వైద్య ఇబ్బంది ఇంటింటికీ తిరుగుతూ పోలియో చుక్కలను అందించనున్నారు.వంద శాతం లక్ష్యం పూర్తి చేసేందుకు వైద్య అధికారులు ఏర్పాట్లు చేశారు.
పల్స్‌పోలియోకు ఏర్పాట్లు పూర్తి చేశాం..
జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. ఐదేండ్లలోపు చిన్నారులకు తల్లి దండ్రులు తప్పకుండా పోలియో వ్యాక్సిన్‌ను ఇప్పించాలి. మొదటి రోజు పోలియో చుక్కలు వేసుకోని చిన్నారులకు ఈ నెల 20,21 వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్లను అందించేందుకు చర్యలు తీసుకున్నాం.
- వసంత్ రావు. జిల్లా వైద్యాధికారి
తాజావార్తలు
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి
- ‘రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి’
- ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్
- గోదారమ్మ పరుగులు..!
- టీఆర్ఎస్ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి
- కోహ్లీ, హార్దిక్ పునరాగమనం
- అంగన్వాడీలకు డ్రెస్‌కోడ్..
- అందరూ హీరోలే..
- ఆర్టీసీకి సం‘క్రాంతి’