శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Jan 19, 2020 , 01:38:42

టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం

టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం


నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అబివృద్ధి, సంక్షేమ పథకాలతో విపక్షాలు ఉనికిని కోల్పోయాయని  రాష్ట్ర అటవీ,పర్యావరణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని రోడ్‌షోతో పాటు ఇంటింటా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మంజులాపూర్‌,ఆస్రానగర్‌ కాలనీ,గాయత్రి పురం,రాంనగర్‌ కాలనీ,ఆద్గాం, ఆదర్శనగర్‌,వెంకటాపూర్‌,గాయత్రి టౌన్‌ షిఫ్‌,శాంతినగర్‌, బస్‌డిపో, బోయివాడ కాలనీల్లో పార్టీ అభ్యర్థులు, యువకులు,నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని అన్నారు. బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలు రెండో సారి అధికారాన్ని కేసీఆర్‌కు అప్పగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే విపక్షాలు తమ ఉనికి కోసం దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.

సాధారణ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌,బీజేపీలు తెలంగాణలో అడ్రస్‌ లేకుండా పోయాయన్నారు. నిర్మల్‌ మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలా చారి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రవోతు రాజేందర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, లోలం శ్యాంసుందర్‌ రెడ్డి, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణ గౌడ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌,మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దర్మాజి రాజేందర్‌,పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, సుభాష్‌రావు, భూషణ్‌ రెడ్డి,దేవేందర్‌ రెడ్డి,గోవర్ధన్‌రెడి,్డ అయ్యన్నగారి రాజేందర్‌, మల్లికార్జున్‌ రెడ్డి, సంపంగి రవి, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.


logo