శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Jan 18, 2020 , 00:28:38

కానిస్టేబుళ్లు క్రమశిక్షణను అలవర్చుకో

కానిస్టేబుళ్లు క్రమశిక్షణను అలవర్చుకో
  • -రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి
  • - ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు వారియర్‌
  • - డీటీసీలో నూతన కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం
  • -రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి
  • -ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు వారియర్‌
  • -డీటీసీలో కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : నూతన కానిస్టేబుళ్లు క్రమశిక్షణను అలవర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్‌ డీటీసీకి గుర్తింపు తీసుకురావాలని ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణువారియర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీటీసీలో నూతనంగా ఎంపికైన హైదరాబాద్‌కు చెందిన సీవిల్‌ కానిస్టేబుళ్లకు శిక్షణను ఎస్పీ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శిక్షణకు వచ్చిన కానిస్టేబుళ్లు ఇబ్బందిగా ఉండొద్దని పోలీసు కుటుంబంలో చేరినట్లు ఉండాలన్నారు. పోలీసులపై బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. 260 మంది కానిస్టేబుళ్లకు గాను 144 మంది ప్రస్తుతం శిక్షణ శిబిరానికి చేరుకున్నట్లు తెలిపారు. ఉన్నత చదువులు చదివిన వారు ఉండడం శుభపరిణామన్నారు. కానిస్టేబుల్‌గా కాకుండా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనుభజ్ఞులైన అధ్యాపకులతో బోధన, శిక్షణను ఇప్పిస్తున్నట్లు తెలిపారు. పదినెలల పాటు శిక్షణ, రెండేండ్లపాటు ప్రొహిబిషన్‌ ఉంటుందన్నారు. ప్రజల రక్షణ, ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. పోలీసులకు కులమతాలు ఉండవన్నారు.

నేరం చేసిన ఎంతటి వారినైనా చట్టం ముందుకు తీసుకురావాలని చెప్పారు. దేశంలో తెలంగాణ పోలీసు నంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. పోలీసుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభు త్వం కృషిచేస్తున్నదని తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు వేతనాలు ఉన్నాయన్నారు. శిక్షణ సమయంలో ఏమైనా ఇబ్బందులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు అన్ని సౌకర్యలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ టీఎస్‌ రవికుమార్‌, శిక్షణ ఐపీఎస్‌ అధికారి హర్షవర్ధన్‌ శ్రీవాస్తవ్‌, డీటీసీ డీఎస్పీ ఎల్‌సీ నాయక్‌, ఏఆర్‌ డీఎస్పీ సయ్యద్‌ సుజాదొద్దీన్‌, డీటీసీ సీఐ గంగాధర్‌, మహిళా ఎస్సై పద్మ, ఎస్సైలు మల్లేశ్‌, ఉశన్న, డీపీవో స్టాఫ్‌ ఏవో ఏసురత్నం, జోసెఫిన్‌, నయీం, జగదీశ్‌, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.logo