మంగళవారం 07 ఏప్రిల్ 2020
Nirmal - Jan 16, 2020 , 23:56:44

భైంసాలో ప్రశాంతం

 భైంసాలో ప్రశాంతం


భైంసా, నమస్తే తెలంగాణ/ భైంసారూరల్ : భైంసా పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గురువారం పట్టణంలోని పలు చోట్ల దుకాణాలను పాక్షికంగా తెరిచారు. గత ఆదివారం నుంచి భైంసా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ విషయం విధితమే. కాగా మంగళ, బుధవారాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా మూసి ఉంచిన దుకాణాలను గురువారం  తెరుచుకున్నాయి. పట్టణంలోని పాత కాలనీలలో కోర్వగల్లి, పురాణాబజార్, కిసాన్ భట్టిగల్లిలో మాత్రం పరిస్థితి నిర్మానుష్యంగా ఉంది. రాత్రివేళల్లో పోలీసులు క ర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. ర్యాపిడ్ యాక్షన్ బలగాలు ప్రధాన వీధుల్లో ప్రతిరోజూ కవాతును నిర్వహిస్తున్నాయి.  ఇదిలా ఉండగా అల్లర్లకు కారణమైన మూకల అరెస్టు సైతం కొనసాగుతుంది. ఇప్పటికీ సుమారు 50 మంది వరకు అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. ఎస్పీ శశిధర్ ఐదు రోజులుగా భైంసా లో మకాం వేసి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. ప్రధాన కూడళ్లలో పికెటింగ్ కొనసాగుతున్నాయి. 24 గంట ల పా టు పట్టణ ప్రధాన రోడ్లతో పాటు వీధుల్లో సై తం  పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పాక్షికంగా దుకాణాలు తెరుచుకోవడమేగాకుండా ప్రజలు సైతం బయటకు వస్తుండడంతో పరిస్థితులు యథావిధిగా మారుతున్నాయి. బస్టాండ్ ప్రయాణికుల సందడి కనిపించింది. పోలీసు అధికారులు బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

బాధితులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే

భైంసా, నమస్తే తెలంగాణ : ఇరువర్గాల ఘర్షణలో ఇండ్లు ధ్వంసమైన బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ అన్నారు. బుధవారం పట్టణంలోని కోర్బగల్లీలో దెబ్బతిన్న, ధ్వంసమైన ఇండ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకోని డబుల్ ఇండ్లను మంజూరీకి కృషి చేస్తానన్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులతో నష్టపోయిన ఇండ్లను సర్వే చేయించానని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సూచించారు. అల్లర్లలో దగ్ధమైన ద్విచక్రవాహనాలకు పూర్తి స్థాయిలో బీమా వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికి తిరిగి దెబ్బతిన్న, ధ్వంసమైన ఇండ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, డాక్టర్ దామోదర్ అనిల్, హల్దా రాజలింగు, మురళీగౌడ్ తదితరులున్నారు.logo