గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 16, 2020 , 15:36:34

నిర్మల్‌ మున్సిపాలిటీ మనదే: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌ మున్సిపాలిటీ మనదే: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌: నిర్మల్‌ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుచుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇవాళ మంత్రి 3వ వార్డు రాంభాగ్‌, బంగల్‌ పేట్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రమాదేవి, పద్మాకర్‌ తరఫున ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ.. ప్రచారం ముమ్మరం చేశారు. మంత్రి ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఓటర్లతో మాట్లాడుతూ.. గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధి, టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కేవలం 5 ఏళ్లలో చేసి చూపించామని మంత్రి ప్రజలకు వివరించారు. నిర్మల్‌లోని ప్రతి వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. తద్వారా నిర్మల్‌ మున్సిపల్‌ పీఠంపై గులాబీ జెండా ఎగురవేయాలని ఆయన ఓటర్లకు విన్నవించారు. రాబోయే రోజుల్లో నిర్మల్‌ పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని మంత్రి ఈ సందర్భంగా ప్రజలతో అన్నారు.


logo
>>>>>>