ఆదివారం 24 మే 2020
Nirmal - Jan 14, 2020 , 00:21:53

కూరగాయల మార్కెట్ మహర్దశ

కూరగాయల మార్కెట్ మహర్దశ


నిర్మల్ టౌన్: పట్టణంలోని కూరగాయల మార్కెట్ షెడ్ల నిర్మాణ పనులు చేపట్టడంతో అటు కూరగాయల విక్రయదారులు, ఇటు పట్టణవాసులకు ఇబ్బందులు దూరమయ్యాయి. రూ.85 లక్షల వ్యయంతో షెడ్లు నిర్మించారు. గతంలో కూరగాయల మార్కెట్ బాలాజీవాడ సమీపంలో ఉండగా అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో గాంధీపార్కులో నూతన కూరగాయ ల మార్కెట్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ పాలకవర్గం 2014లో తీర్మానించగా,  ప్రస్తుత ప్ర భుత్వం రూ.85 లక్షలు విడుదల చేసింది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ సహకారంతో నిధులు విడుదల కావడంతో పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మల్ పట్టణానికి ఇదే కూరగాయల మార్కెట్ ప్రధానం కావడంతో పట్టణానికి చెందిన వారితో పాటు ఆయా గ్రామాలకు చెందిన కూరగాయల వ్యాపారులు, హోల్ రిటైల్ వ్యాపారులు ఇక్కడే క్రయవిక్రయాలు సాగిస్తుంటారు.  మున్సిపల్ పాలకవర్గంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో రూ.85లక్షలను ఖర్చు చేసి కొత్త షెడ్డును నిర్మించారు. మొత్తం 9 షెడ్లు నిర్మించగా.. దీనికింద వంద దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



logo