గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 14, 2020 , 00:21:22

అగ్ని ప్రమాదంలో రెండు ఇండ్లు దగ్ధం

అగ్ని ప్రమాదంలో రెండు ఇండ్లు దగ్ధం


లక్ష్మణచాంద : మండలంలోని పీచర గ్రామానికి చెందిన ఉడత సాయమ్మ, ఉడత పోశన్నకు చెందిన ఇండ్లు ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి షార్ట్ కారణంగా నిప్పులు చెలరేగి రెండిండ్లకు మంటలు అంటుకున్నాయి. గమనించిన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం ఘటనాస్థలానికి చేరుకునే లోపే రెండిండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో చుట్టు పక్కల ఇండ్లకు ప్రమాదం తప్పింది. సర్పంచ్ బుర్రి లత, ఎంపీటీసీ రాజేశ్వర్ రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా, సోమవారం ఉదయం ఆర్ మాధవిలత, వీఆర్ నాగేంద్ర దగ్ధమైన ఇండ్లను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. అగ్ని ప్రమాదంలో ఉడత సాయమ్మకు చెందిన 15 కింటాళ్ల ధాన్యం, రెండు క్వింటాళ్ల బియ్యం, సైకిల్, ఇంటి నిర్మాణ సామగ్రితో పాటు ఎడ్లబండి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఉడత పోశన్నకు చెందిన లేగదూడ ప్రమాదంలో సజీవదహనమైంది. ఘటనలో రూ.లక్షా 30వేల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని వారు తెలిపారు.


logo