ఆదివారం 24 మే 2020
Nirmal - Jan 13, 2020 , 00:38:18

సమాజసేవలో యువత ముందుండాలి

సమాజసేవలో యువత ముందుండాలి
  • - సివిల్‌ జడ్జి అజయ్‌ జాదవ్‌

ఉట్నూర్‌ రూరల్‌: యువత సమాజసేవలో ముందుండాలని, యువజన సంఘాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని మెట్‌పెల్లి సివిల్‌ జడ్జి అజయ్‌ జాదవ్‌, బంజార యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిల్‌ కుమార్‌ జాదవ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని హస్నాపూర్‌ గ్రామం లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద పుట్టిన రోజు సందర్భంగా యువజన దినోత్సవం జరుపుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. గ్రామాభివృద్ధ్దిలో యువకులు పాలుపంచుకోవాలని సూచించారు. యువత చేతిలోనే దేశ భవిత ఆధారపడి ఉందని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం, జూదం వంటి వాటికి దూరంగా ఉండాలని, సెల్‌ఫోన్‌ అధికంగా ఉపయోగించ వద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మోహన్‌, సర్పంచ్‌ ఉపేందర్‌, యూత్‌ సభ్యులు అశోక్‌, రామేశ్వర్‌, సుభాష్‌, విక్రమ్‌ తదితరులు ఉన్నారు.


logo