సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Jan 13, 2020 , 00:36:42

భక్తజన జాతర

భక్తజన జాతర


జైనథ్‌: అంతర్రాష్ట్ర పెన్‌గంగ జాతర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఏడు మాదిరిగానే ఈ సంవత్సరం సైతం ఆదివారం మహారాష్ట్రలోని పాటన్‌బోరి గ్రామం నుంచి రథోత్సవ శోభాయాత్రను నిర్వహించారు. మాధవరావు మహరాజ్‌, శిష్యుడు రామానంద పుణ్యతిథులను పురస్కరించుకొని నిర్వహించే ఈ జాతరకు జాతరకు 132 ఏండ్ల చరిత్ర కలిగి ఉంది. ఐదు రోజులపాటు కొనసాగనున్న ఈ జాతరకు తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని యావత్‌మాల్‌, పాండ్రకవడ తదితర ప్రాంతాల నుంచి భక్తులు  తరలివస్తారు. పెన్‌గంగ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నదీలో గంగమ్మతల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఉత్సవ నిర్వాహకులు పెన్‌గంగ నది వద్ద భక్తుల దర్శనార్థం రథాన్ని ఏర్పాటు చేశారు. మహా అన్నదానం ఏర్పాటు చేశారు. 

పూజలందుకుంటున్న పూసాయి ఎల్లమ్మ...

మరోవైపు పూసాయి ఎల్లమ్మ జాతర కూడా కొనసాగుతున్నది. జైనథ్‌ మండలం  పూసాయి గ్రామంలో ప్రతి ఏటా మాఘమాసం నుంచి పుష్యమాసం వరకు నెలరోజులపాటు జాతర నిర్వహిస్తారు. ఈ జాతర మూడో వారానికి చేరుకున్నది. వచ్చే ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు ఈ జాతరకు హాజరు కానున్నారు. జాతర ఈ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ఆవరణలో ఉన్న కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని జీవాలు, యాటలను బలిచ్చి, పిండి వంటకాలు తయారు చేసి నైవేద్యం సమర్పిస్తున్నారు. కొనేరు జలాన్ని తీర్థ ప్రసాదాలుగా తీసుకెళ్లి పంట పొలాల్లో చల్లుకుంటే పంటలు అధిక దిగుబడి వస్తాయని భక్తులు విశ్వసిస్తారు.


logo