శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Jan 13, 2020 , 00:35:59

రూ.5 లక్షల పట్టివేత

రూ.5 లక్షల పట్టివేత


ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్‌ పట్టణంలోని రాంపూర్‌ వద్ద ఎస్‌ఎస్‌టీ (స్టాటిస్టిక్‌ సర్వైలెన్స్‌ టీం) వాహనాలు తఖీ నిర్వహిస్తుండగా కారులో రూ.5 లక్షలు పట్టుబడ్డాయి. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. పట్టణ సమీపంలోని రాంపూర్‌ వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. రోజు వారీగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆదివారం సైతం ఎస్‌ఎస్‌టీ టీం సభ్యులు వాహనాలు తనిఖీ  చేస్తుండగా మహారాష్ట్రలోని వణీకి చెందిన ప్రశాంత్‌ కొటారీ ఎంహెచ్‌ 32 సీ 4261 నెంబర్‌ గల స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో రూ.5 లక్షలు ఆదిలాబాద్‌ వైపు తీసుకువస్తుండగా పట్టుకున్నారు. ఈ డబ్బుకు సంబంధించి ఆధారాలు చూపించాలని అధికారులు కోరగా.. పొంతన లేని సమాధానం ఇచ్చారు. దీంతో అధికారులు డబ్బును సీజ్‌ చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఈ డబ్బును రూరల్‌ పీఎస్‌లో భద్రపరిచారు. సోమవారం ట్రెజరరీ కార్యాలయంలో జమ చేయనున్నారు. ఎస్‌ఎస్‌టీ సభ్యులు యజువేందర్‌రెడ్డి, ప్రభు ఉన్నారు.


logo