ఆదివారం 24 మే 2020
Nirmal - Jan 12, 2020 , 01:54:59

జిల్లాలో విజయవంతం

జిల్లాలో విజయవంతం


పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. అన్ని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో  ప్రత్యేక అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు,  మౌలిక అవసరాలను గుర్తించారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారంలో భాగంగా మొక్కల సంరక్షణ, ప్రతి గ్రామ పంచాయతీలో చెత్త డంపింగ్‌, శ్మశాన వాటికల నిర్మాణం, తడి,  పొడి చెత్త షెడ్ల వంటి పనులను నిర్వహించారు. ఇదే కాకుండా గ్రామాల్లో అంతర్గత రోడ్ల పరిశుభ్రత, థర్డ్‌లైన్ల పనుల ఏర్పాట్లను పరిశీలించారు.  పల్లె  ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలని  ఆదేశించడంతో ఇప్పటివరకు 120కి పైగా గ్రామాల్లో ట్రాక్టర్లను కొనుగోలు చేశారు.  పల్లె ప్రగతిలో ట్రాక్టర్‌ సేవలు వినియోగించుకుంటున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖాశ్యాంనాయక్‌లతో పాటు  ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం ప్రాధాన్యతను వివరించడంతో ప్రజలు కూడా భాగస్వామ్యమయ్యారు. కలెక్టర్‌ ఎం.ప్రశాంతితో పాటు రాష్ట్ర ప్రత్యేక బృందాలు కూడా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పర్యవేక్షించాయి.  శనివారం అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామసభలో చర్చించి తీర్మానించారు.


logo