గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 12, 2020 , 01:54:30

‘ప్రగతి’ బాటలో పల్లెలు

‘ప్రగతి’ బాటలో పల్లెలు


నిర్మల్‌ టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం శనివారం ముగిసింది.  జిల్లాలోని 19 మండలాల పరిధిలో ఉన్న 396 గ్రామాల్లో పల్లె  ప్రగతి కార్యక్రమాన్ని ప్రత్యేకాధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన కార్యక్రమం 11వ వరకు నిర్వహించారు.  పల్లె ప్రగతి కార్యక్రమంలో పల్లెల్లో ప్రగతి సాధించగా.. ప్రజల భాగస్వామ్యంతో పల్లెలు అద్దంలా మెరిసెలా తయారయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యారు. ఇందుకోసం జిల్లాలో అన్ని మండలాల వారీగా  ప్రత్యేకాధికారులతో పాటు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి పల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.


logo
>>>>>>