సోమవారం 30 మార్చి 2020
Nirmal - Jan 12, 2020 , 01:53:38

జిల్లాలో రెండు నామినేషన్ల తిరస్కరణ

జిల్లాలో రెండు నామినేషన్ల తిరస్కరణ


నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ: జిల్లాలో మూడు మున్సిపాల్టీ ఎన్నికలకు సంబంధించి దాఖలు చేసిన నామినేషన్‌లలో రెండు నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఖానాపూర్‌ మున్సిపాల్టీలో 85 నామినేషన్లు, భైంసాలో 160, నిర్మల్‌ మున్సిపాల్టీలో 224 నామినేషన్‌లు దాఖలు కాగా వీటిలో రెండు నామినేషన్‌లను తిరస్కరించారు. మొత్తం 222 నామినేషన్లు  మిగిలాయి. ఇందులో నిర్మల్‌ మున్సిపాల్టీకి చెందిన ఓఅభ్యర్ధి మూడు సెట్‌లు నామినేషన్‌లు వేయగా ఒకటి కరెక్టు ఉండగా మిగతా రెండింటిలో సంతకం లేకపోవడంతో నిరాకరించారు. ఉదయం  మున్సిపల్‌ కార్యాల యంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రశాంతి సందర్శించారు. నామినేషన్‌ల తిరస్కరణ విధానాన్ని రిటర్నింగ్‌ అధికారులను  అడిగి తెలుసుకున్నారు. నామినేషన్‌ల కేంద్రం వద్ద ఎలాంటి ఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు,  డీఈ సంతోష్‌ ఉన్నారు.

అభివృద్ధే టీఆర్‌ఎస్‌ పార్టీ ఎజెండా


నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ: నిర్మల్‌ పట్టణ అభివృద్ధే టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య ఎజెండా అని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు  కార్యాలయంలో నిర్మల్‌ మున్సిపాల్టీలో పోటీ చేసే 42 వార్డుల టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...నిర్మల్‌ మున్సిపాల్టీలో మరో రూ. 52 కోట్ల నిదులు ఉన్నాయని ఎన్నికల అనంతరం ఖర్చుచేయనున్నట్లు తెలిపారు.నిర్మల్‌ పట్టణాన్ని కోట్లాది రూపాయలతో  అబివృద్ధి చేశామని తెలిపారు.36 వార్డుల్లో సీసీ రోడ్లు,డ్రైనేజీల నిర్మాణాలతో పాటు,కుల సంఘాలకు భవన నిర్మాణాలకు  నిధులు మంజూరుచేసినట్లు చెప్పారు. పార్టీలో పోటీ ఎక్కువగా ఉందని సర్వే ఆధారంగానే అభ్యర్థులకు సీట్లను కేటాయించినట్లు తెలిపారు. టికెట్లు రాని వారు నిరాశ చెందకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అబివృద్ధి  పనులను ప్రజలకు వివరించి ఓట్లను అడుగాలని  సూచించారు. ఎన్నికల ఖర్చుపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరినీ  ఓటు అడిగి ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించేలా చూడాలని, ప్రతి వార్డుకు ఇన్‌చార్జిని నియమించామన్నారు. అనంతరం 42 వార్డుల టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు భీ-ఫారాలను అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి  దాదాన్న గారి విఠల్‌ రావు,రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణ గౌడ్‌,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, ధర్మాజి రాజేందర్‌. ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు రాముగొండ రాము, అల్లోల మురళీధర్‌ రెడ్డి, అయన్నగారి రాజేందర్‌,గోవర్ధన్‌ రెడ్డి,ముడుసు సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


logo