సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Jan 12, 2020 , 01:53:02

పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి

పల్లెలు  పచ్చదనంతో కళకళలాడుతున్నాయిలక్ష్మణచాంద: పల్లెలు పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడుతున్నాయని రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కనకాపూర్‌లో నిర్వహించిన పల్లెప్రగతిలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నదని, ఆ నిధులతో గ్రామాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణ అమలువుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంతోనే ఈ పథకాలు సాధ్యమయ్యాయని, తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌ను దేవుడిలా కొలుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌  సొక్కురాజవ్వ, ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, కో ఆప్షన్‌మెంబర్‌ జహీరొద్దీన్‌, మండల ప్రత్యేకాధికారి కోటేశ్వర్‌రావు, ఎంపీడీవో మోహన్‌, తహసీల్దార్‌ సత్యనారాయణరావు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.


logo