శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Jan 12, 2020 , 01:52:23

జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తేవాలి

జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తేవాలినిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ:  క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని పేటా అధ్యక్షుడు భుక్య రమేశ్‌ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా క్రీడాకారులను శనివారం ఎన్టీఆర్‌ మినీస్టేడియంలో అభినందించి క్రీడా దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ సెక్రెటరీ శ్రీనివాస్‌, పేటా సెక్రెటరీ భోజన్న, దీనాకుమారి, సుభాష్‌, నాందేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రీడలపై మక్కువ పెంచుకోవాలి

విద్యార్థులు క్రీడలపై మక్కువ పెంచుకోవాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఇటీవల నిర్మల్‌ పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను శనివారం పాఠశాలలో అభినందించారు. ఆయా క్రీడల్లో రాణించి రవి పాఠశాల చాపింయన్‌షిప్‌ను కైవసం చేసుకోవడం అభినందనీయన్నారు. కార్యక్రమంలో పీఈటీ దత్తు, వీర, కృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo