గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 12, 2020 , 01:51:49

పల్లె ప్రగతితో గ్రామాలు పరిశుభ్రం

పల్లె ప్రగతితో గ్రామాలు పరిశుభ్రంభైంసారూరల్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయని కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. మండలంలో రెండు ఆదర్శ గ్రామాలను ఎంపిక చేయడంలో భాగంగా శనివారం ఖథ్‌గాం గ్రా మాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల ను పరిశుభ్రంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు శుభ్రంగా ఉం చాలని సూచించారు. గ్రామా ల్లో డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలకు ప్రతి శుక్రవారం తప్పకుండా నీళ్లు పట్టాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నదని, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. గ్రామంలో పెంటకుప్పలు ఉండకూడదని, అపరిశుభ్రతకు కారకులైన వారికి జరిమానా విధించాలని ఆమె అధికారులకు సూచించారు. కథ్‌గాంను జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని అన్నారు. అనంతరం డంపింగ్‌యార్డు పనులను పరిశీలించారు. కలెక్టర్‌ మొదటి సారి కథ్‌గాంకు రావడంతో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, డీఎల్పీవో శివకృష్ణ, సర్పంచ్‌ రాజు, ఎంపీడీవో గోపాలకృష్ణరెడ్డి, మండల ప్రత్యేకాధికారి దేవేందర్‌, ఎంపీటీసీ మాణిక్‌రావు, నాయకులు గణేశ్‌ పటేల్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

కుంటాల మండలంలో..
కుంటాల : మండలంలోని పెంచికల్‌పాడ్‌, విఠాపూర్‌ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను కలెక్టర్‌ ప్రశాంతి పరిశీలించారు. పెంచికల్‌పాడ్‌ గ్రామంలో డ్రైనేజీలు నిర్మించాల ని, కాలువల ద్వారా మురికి నీరు వెళ్తుండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. పెంచికల్‌పాడ్‌ పాఠశాల అభివృద్ధికి సహకరించిన ప్రధానోపాధ్యాయుడు ఎల్లన్నను అభినందించారు. విఠాపూర్‌ గ్రామం లో  పర్యటించి మొక్కలు నాటారు. పచ్చదనం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, మండల ప్రత్యేకాధికారి క్రాంతికుమార్‌, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, ఈవోపీఆర్డీ ప్రసాద్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>