సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Jan 10, 2020 , 11:15:20

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ఆదిలాబాద్ రూరల్ : పాఠశాల దశ నుంచే విద్యార్థులను దేశానికి అవసరమైన ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ (ఎస్‌పీసీ)ని ప్రారంభించామని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం ఎస్‌పీసీ విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మూడేండ్ల క్రితం ఎస్‌పీసీని ప్రారంభించామని, ఇప్పటి వరకు జిల్లాలోని 16 పాఠశాలల్లో ఎస్‌పీసీని నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 900 మంది విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు పరేడ్‌లోనూ శిక్షణ అందించి దేశానికి అవసరమైన విధంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యార్థి దశ నుంచే వారిలో ఆత్మైస్థెర్యంతో పాటు, సేవా గుణం పెంపొందించేలా చూస్తున్నామన్నారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించి సమాజంలో ఎలా జీవించాలో ఎస్‌పీసీ బోధిస్తుందన్నారు. వారు సమాజంలో ఉంటూ చెడుకు దూరంగా ఉండి పోలీసులకు చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. వేసవి సెలవుల కంటే ముందు ప్రస్తుతం ఎస్‌పీసీ చేస్తున్న విద్యార్థులకు వారం రోజుల పాటు క్యాంపు నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం మొదటి బ్యాచ్ ఎస్‌పీసీ పూర్తి చేసుకున్న 173 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
16 పాఠశాలల నుంచి తరలివచ్చిన ఎస్‌పీసీ విద్యార్థులతో పరేడ్ మైదానంలో కోలాహలం నెలకొంది. ట్రెయినీ ఐపీఎస్ హర్షవర్ధన్ శ్రీవాస్తవ , ఏఆర్ డీఎస్పీ సయ్యద్ సుజాఉద్దీన్, ఆర్‌ఐ సుధాకర్ రావు, కమతం ఇంద్రవర్ధన్, ఇన్‌చార్జి హెడ్‌కానిస్టేబుల్ అత్తవుల్లా ఖాన్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
ఆదిలాబాద్ రూరల్ : నూతన క్రీడ అయిన స్పీడ్‌బాల్‌లో జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సైతం రాణించాలని జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రలోని లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో అండర్ -14,17 జోనల్ స్థా యి స్పీడ్‌బాల్ ఎంపిక పోటీలను గురువారం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన క్రీడాంశాలతో అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు. క్రీడల్లో నిలకడగా రాణించాలంటే నిత్యం సాధన చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు క్రీడలను ప్రొత్సహించడానికి ముం దుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం స్పీడ్‌బాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. పాఠశాల ప్రిన్సిపాల్ కమలాకర్ రెడ్డి, కోఆర్డినేటర్ స్వరూప, పీఈటీ షోయబ్ పాల్గొన్నారు.


logo