గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 10, 2020 , 11:11:11

మున్సిపల్ ఏ, బీ ఫారాలను అందజేసిన కేటీఆర్

మున్సిపల్ ఏ, బీ ఫారాలను అందజేసిన కేటీఆర్

ఆదిలాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల రెండో జోరు గురువారం జోరు కొనసాగింది. మొదటి రోజు 17 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజు 127 నామినేషన్ల వచ్చాయి. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 49 వార్డులకు గానూ అధికారులు పాలిటెక్నిక్ సమీపంలోని సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రంలో రెండు భవానాలను ఏర్పాటు చేయగా అభ్యర్థులు తమ వార్డుల్లో పోటీ చేసేందుకు సహచరులతో కలిసి నామినేషన్లు సమర్పించారు. ఉదయం నెమ్మదిగా ప్రారంభమైన నామినేషన్ల అందజేత మధ్యాహ్నం జోరుగా సాగింది. మధ్యాహ్నం తర్వాత వివిధ పార్టీలకు చెందిన ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రావడంతో సాయంత్రం ఆరున్నర వరకు నామినేషన్లు తీసుకున్నారు.

ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రెండోరోజు నామినేషన్లు వేసేందుకు భారీ సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తరలివచ్చారు. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగింది. మధ్యాహ్నం తర్వాత మంచి మహుర్తం ఉండటంతో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ల వేసేందుకు వచ్చారు. నామినేషన్లు దాఖలు చేసే సమయం ఐదు గంటలు గడిచిపోయినా అంతకు ముందుగానే వచ్చిన అభ్యర్థులు లైన్ల ఉండటంతో అధికారులు వారిని అనుమతించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 49 వార్డులకు గానూ అధికారులు పాలిటెక్నిక్ సమీపంలోని సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రంలో రెండు భవానాలను ఏర్పాటు చేయగా అభ్యర్థులు తమ వార్డుల్లో పోటీ చేసేందుకు సహచరులతో కలిసి నామినేషన్లు సమర్పించారు. రెండో రోజు మొత్తం 127 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్ 55, బీజేపీ 28, కాంగ్రెస్ 15, ఎంఐఎం 10, ఇండిపెండెంట్‌లు 18, టీడీపీ తరఫున ఒక నామినేషన్ దాఖలైంది. మొదటి రోజు 17 నామినేషన్లు వచ్చాయి. నేడు నామినేషన్లకు చివరి రోజు కావడంతో వివిధ పార్టీల అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్ల దాఖలు చేసే అవకాశాలున్నాయి.


logo