e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జిల్లాలు ఉనికి కోసమే రేవంత్‌రెడ్డి ఆరోపణలు

ఉనికి కోసమే రేవంత్‌రెడ్డి ఆరోపణలు

ఉనికి కోసమే రేవంత్‌రెడ్డి ఆరోపణలు

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి గంగాధర్‌ గౌడ్‌
నిర్మల్‌ అర్బన్‌/ ముథోల్‌, జూలై 19: ఉనికి కోసమే రేవంత్‌ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నా డని, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ జిల్లా సభ్యత్వాల ఇన్‌చార్జి గంగాధర్‌ గౌడ్‌ తెలిపారు. నిర్మల్‌ ఐబీలో, ముథోల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డితో కలిసి సోమవా రం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పీ సీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి హుందాతనంగా లేకుండా చిన్నపిల్లాడిలా మాట్లాడడం సబబు కా దన్నారు. గతంలో కాంగ్రెస్‌ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వేసిన భూ ముల వేలాన్ని కేసీఆర్‌ అడగకపోతే తెలంగాణలో భూములు ఉండేవి కాదన్న విషయం గుర్తు చేసు కోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థల ద్వారా వేలాన్ని నిర్వహించిందన్నారు.

ఇప్పటి వ రకు రాష్ట్రంలో లక్షా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశా మని, త్వరలోనే 60 వేల ఉద్యోగాలకు సంబం ధించి నోటిఫికేషన్‌ జారీ చేయబోతున్నట్లు చెప్పా రు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పాలిత ప్రాంతాల్లో ఈ పథకాలు అమల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. నిర్మల్‌ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి ఇంద్రక రణ్‌ రెడ్డిపై ఆరోపణలు చేయడాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ, రాష్ట్ర కార్యదర్శి హోదాలో తాము ఖండిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారని, హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు విలాస్‌ గాదేవార్‌, భైంసా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పీ కృష్ణ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సాగరబాయి రాజన్న, నాయకులు మ గ్ధూం, తోట రాము, ఆసిఫ్‌, సమీఉల్లాఖాన్‌, బాబన్న, నిర్మల్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్‌, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ముడుసు సత్యనారాయణ తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉనికి కోసమే రేవంత్‌రెడ్డి ఆరోపణలు
ఉనికి కోసమే రేవంత్‌రెడ్డి ఆరోపణలు
ఉనికి కోసమే రేవంత్‌రెడ్డి ఆరోపణలు

ట్రెండింగ్‌

Advertisement