e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home ఆదిలాబాద్ పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ
భైంసా టౌన్‌, జూలై 19: పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ పిలుపు నిచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మతపెద్దలతో, అ ధికారులతో సోమవారం బక్రీద్‌ పండుగ సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని మతాల పండుగలను మీతో పాటే మేము కూడా ఇక్కడే కలిసి నిర్వహించుకుంటామని చెప్పారు. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని , భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఏవైనా సంఘటనలు జరిగితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, పోలీసులకు స మాచారం ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల ముం దు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీని వల్ల అమాయకులు కేసుల్లో ఇరుక్కోకుండా ఉంటారని తెలిపా రు. అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్‌ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్‌, తహసీల్దార్‌ విశ్వంభర్‌, ఏఎస్పీ కిరణ్‌ ప్రభాకర్‌ కారే, డీపీఆర్వో తిరుమల, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జాబీర్‌ హై మద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎంఏ అలీం, పట్టణ సీఐలు ప్రవీణ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, ఎంపీడీవో గోపాల్‌కృష్ణ రెడ్డి, డాక్టర్‌ నగేశ్‌, బబ్రు మహరాజ్‌, పురావస్తు చిన్నన్న, బాలాజీ సూత్రా వే, ఫైజుల్లా ఖాన్‌, ఇద్రీస్‌ బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కుంటాల, జూలై 19: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలను భాగస్వామ్యం చేసి ప్ర త్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తెలిపారు. మండలంలోని కల్లూర్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ తో కలిసి సోమవారం పరిశీలించారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. అర్లి ఎక్స్‌ రోడ్డుతో పాటు కల్లూర్‌లోని కుంటాలకు వెళ్లే మార్గంలో ప్రత్యేక స్పీడు బ్రేకర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తిం చారు. రోడ్డుకు ఇరువైపులా వివిధ పార్టీల బ్యానర్లు, జెండాలను అనుమతి లేకుండా ఏర్పాటు చేయకుండా చూడాలని స్థానిక అధికారులకు సూచించారు. తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో దేవేందర్‌ రెడ్డి, ఆర్‌అండ్‌ డీఈ రవీందర్‌ రె డ్డి, ఎస్‌ఐ శ్రీకాంత్‌ తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement