e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home జిల్లాలు గడువులోగా పూర్తి కాకుంటే చర్యలు

గడువులోగా పూర్తి కాకుంటే చర్యలు

గడువులోగా పూర్తి కాకుంటే చర్యలు

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్‌ కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం

నిర్మల్‌ చైన్‌గేట్‌, జూలై 17 : గడువులోగా పనులు పూర్తి కాకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అటవీ శాఖ అధికారులు జాప్యం లేకుండా అనుమతులు ఇవ్వాలన్నారు. తెలంగాణకు హరితహారంలో మొక్కలు నాటడంలో జిల్లా మూడో స్థానంలో ఉందని తెలిపారు. అటవీ, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటు పడాలన్నారు. మారుమూల ప్రాంతా ల్లో అనుమతులు లేని కారణంగా అనేక రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి 9 రోడ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆర్‌అండ్‌బీ నుంచి అల్లంపల్లి, రాశిమెట్ట నుంచి కోరకల్‌, కోసగుట్ట, ఎర్వచింతల నుంచి దత్తోజిపేట వరకు పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. అటవీశాఖకు సంబంధించిన ప్రతిప్రాదనలు ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పంపించాలని సూచించారు. ఆగస్టు 15 వరకు పనులు పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, చీఫ్‌ కన్జర్వేటర్‌ వినోద్‌, అటవీశాఖ అధికారి వికాస్‌మీనా, సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మత్స్య కారులందరికీ ప్రమాద బీమా
నిర్మల్‌ అర్బన్‌, జూలై 17 : మత్స్య సహకార సంఘంలో నమోదైన సభ్యులందరికీ ప్రమాద బీమా పథకం వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన పలువురికి మంత్రి క్యాం పు కార్యాలయంలో బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెలిపారు. మత్స్యకారులకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తున్నదని స్పష్టం చేశారు. నిర్మల్‌ నియోజకవర్గంలోని టెంబుర్ని గ్రామానికి చెందిన గుమ్ముల నరేశ్‌, లక్ష్మణచాంద మండలం మల్లాపూర్‌ గ్రామానికి చెందిన పుట్టి రాజవ్వ, నిర్మల్‌ మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన ఎల్లుళ్ళ నర్సవ్వ కుటుంబాలకు రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు సుభాష్‌ రావు, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, గంగపుత్ర సంఘం సభ్యులు పోశెట్టి, భోజన్న, గొనుగోపుల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
సంతాపం తెలిపిన మంత్రి
ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ తండ్రి శం కర్‌ నాయక్‌ శనివారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం తెలిపారు. రాజా శంకర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కు టుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎల్‌వోసీ అందజేత..
నిర్మల్‌ పట్టణంలోని బుధవార్‌పేట్‌ కాలనీకి చెందిన దంతెవార్‌ ఇందిర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నది. కొంత కాలంగా వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న ఇందిర ఆర్థిక, అనారోగ్య పరిస్థితిని స్థానిక నాయకులు డీ శ్రీనివాస్‌ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందిరకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు గాను సీఎం సహాయ నిధి నుంచి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా మంత్రికి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
దిలావర్‌పూర్‌, జూలై 17 : మండలంలోని కదిలి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, సహకార సంఘం డైరెక్టర్‌ దత్తురాం పటేల్‌ కొడుకు ఐదు రోజులు క్రితం మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్‌ పీవీ రమణారెడ్డి, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు డాక్టర్‌ సుభాష్‌రావు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కోడే రాజేశ్వర్‌, ఎఫ్‌ఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, కదిలి ఆలయ చైర్మన్‌ భుజంగ్‌రావు పటేల్‌, మాజీ చైర్మన్‌ సంబాజీ పటేల్‌, సప్పల రవి, ఎంపీటీసీలు పాల్ధే అక్షర అనీల్‌, ఉప సర్పంచ్‌ మారుతీ పటేల్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గడువులోగా పూర్తి కాకుంటే చర్యలు
గడువులోగా పూర్తి కాకుంటే చర్యలు
గడువులోగా పూర్తి కాకుంటే చర్యలు

ట్రెండింగ్‌

Advertisement