e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home ఆదిలాబాద్ పొంగుతున్న వాగులు..వంకలు

పొంగుతున్న వాగులు..వంకలు

పొంగుతున్న వాగులు..వంకలు

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు..
పలు చోట్ల రాకపోకలకు అంతరాయం

ఇంద్రవెల్లి, జూలై15: మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మండలంలో వాగులు, వం కలు వరదతో ఉప్పొంగుతున్నాయి. చెరువులతోపాటు చెక్‌డ్యాంలు, నీటికుంటలు, వాగులు జలమయమయ్యాయి. జైత్రం తండా, జెండాగూడ, గౌరాపూర్‌ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జైత్రం తండా వాగుపొంగిపోవడంతో గ్రామస్తులు చెక్‌డ్యాం కట్ట్టపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మట్టిరోడ్లు చిత్తడిగా మారడంతో రైతులు పొలాలకు వెళ్లలేకపోతున్నారు.
వర్షానికి ఇల్లు నేలమట్టం
నార్నూర్‌, జూలై15: మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి గాదిగూడ మండలం లోకారి(కే)లో కొడప జంగుకు చెందిన రేకుల ఇల్లు బుధవారం రాత్రి కూప్పకూలింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రమా దం తప్పింది. కూలిన ఇంటిని గిర్దావర్‌ సేవంత గురువారం పరిశీలించారు. ఆమె వెంట అంగన్‌వాడీ టీచర్‌ జాదవ్‌ సుభద్ర ఉన్నారు.
మత్తడిపాజెక్టు గేట్లు ఎత్తివేత…
తాంసి, జూలై 15: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని వడ్డాడి మత్తడి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో ఇంజినీరింగ్‌ అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 276.50మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 3000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పొంగుతున్న వాగులు..వంకలు
పొంగుతున్న వాగులు..వంకలు
పొంగుతున్న వాగులు..వంకలు

ట్రెండింగ్‌

Advertisement