సోమవారం 30 మార్చి 2020
Nirmal - Jan 15, 2020 , 00:33:06

టీఆర్‌ఎస్‌లో చేరికలు

టీఆర్‌ఎస్‌లో చేరికలు
  • సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలి

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శాస్త్రినగర్‌ కాలనీకి చెందిన ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు జుట్టు దినేశ్‌, పురణాపేట్‌, పింజరిగుట్ట కాలనీలకు చెందిన సుమారు వందమంది నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అన్ని వార్డుల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అన్నారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు ఆయా వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పూర్తి మద్దతు తెలిపి వారి విజయానికి కృషి చేయాలని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ధర్మాజి రాజేందర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గండ్రంత్‌ ఈశ్వర్‌, తిరుపతిరెడ్డి, పూదరి రాజేశ్వర్‌తో పాటు ఆయా వార్డుల పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  


ఎమ్మెల్యే రేఖానాయక్‌ సమక్షంలో.. 

ఖానాపూర్‌: పట్టణానికి చెందిన పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అజ్మీరా రేఖానాయక్‌ సమక్షంలో కొండ నారాయణ, ఎనగందుల రవి, గన్నాయి కృష్ణ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులపై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. logo