ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Jan 15, 2020 , 00:31:43

భైంసా ప్రశాంతం

భైంసా  ప్రశాంతం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి అల్లోల గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అన్ని వార్డుల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు ఆయా వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పూర్తి మద్దతు తెలిపి వారి విజయానికి కృషి చేయాలని కోరారు. ఖానాపూర్‌ పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే రేఖానాయక్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

  • నిర్మానుష్యంగా పలు కాలనీలు
  • రెండోరోజూ నిలిచిన ఇంటర్‌నెట్‌ సేవలు
  • నిందితుల ఆచూకీపై ఆరా!
  • ముమ్మర వాహనాల తనిఖీలు
  • పరిస్థితులను సమీక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
  • కొనసాగుతున్న కర్ఫ్యూ

భైంసా, నమస్తే తెలంగాణ/ భైంసారూరల్‌ : భైంసా పట్టణంలో మంగళవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. పోలీసు యంత్రాంగం సోమవారం రాత్రి 7 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు పట్టణంలో కర్ఫ్యూ విధించారు. 7 గంటల అనంతరం కర్ఫ్యూ సడలించడంతో కూరగాయాలు, పాలదుకాణాలు, పత్రికలు విక్రయించే ప్రదేశంలో రద్దీ నెలకొంది. కాలనీల్లో జన సంచారం మాత్రం అంతగా లేదు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు మంగళవారం సైతం మూసి ఉన్నాయి. ఐజీలు నాగిరెడ్డి, ప్రమోద్‌కుమార్‌ ఆదివారం అర్ధరాత్రి నుంచి భైంసా పట్టణంలోని మకాం వేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ బలగాలు సైతం పట్టణానికి చేరుకొని కాలనీల్లో కవాతు నిర్వహించారు.  సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు.  ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఉన్నతాధికారులు పోలీసు యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అల్లర్లు జరిగిన కోర్వ గల్లిలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. ఘటన బాధితులకు భట్టిగల్లిలోని మున్నూరుకాపు సంఘంలో శిబిరం ఏర్పాటు చేసి భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పాండ్రిగల్లి వాసులకు మహదేవ్‌ మందిరంలో శిబిరం ఏర్పాటు చేశారు. రెండో రోజు సైతం ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. నిర్మల్‌ ఎస్పీ శశిధర్‌రాజు, రామగుండం, సిద్దిపేట కమిషనర్లు సత్యనారాయణ, డెవిడ్‌జోయేల్‌, గతంలో భైంసాలో డీఎస్పీగా పని చేసిన రాజేశ్‌భల్లా, అందెరాములు, భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు, సీఐలు వేణుగోపాల్‌రావు, శ్రీనివాస్‌,  మొబైల్‌ పెట్రోల్‌ వాహనంలో తిరుగుతూ.. బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. 


నిందితుల ఆచూకీపై ఆరా..

నిందితుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం ఇరు వర్గాలకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకొగా.. మంగళవారం మిగతా నిందితులు, పాత నేరస్తుల చిట్టా ప్రకారం  వేట ప్రారంభించారు. 


రెండో రోజూ కర్యూ 

పట్టణంలో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు పోలీసులు మళ్లీ కర్యూ విధించారు. ఆదివారం అల్లర్లు ప్రారంభం కాగా.. పోలీసులు సోమవారం రాత్రి సమయంలో కర్యూ ప్రకటించారు. 

అనంతరం మంగళవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కర్యూ సడలించారు. మంగళవారం రాత్రి మళ్లీ కర్యూను ప్రకటించారు. 


logo