హైదరాబాద్: పదో తరగతి పూర్తివగానే మూడేండ్ల డిప్లొమా కోర్సు పూర్తవగానే లైఫ్‌లో సెటిలవ్వొచ్చు. ఉద్యోగం వద్దనుకుంటే బీటెక్ సెకండియర్‌లో చేరి ఉన్నత విద్యనభ్యసించవచ్చు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాల కోసం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) తెలంగాణ 2021-22 విద్యా సంవత్సరానికిగాను పాలీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ)
పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్టీవీయూ)
SBTET ద్వారా అనుమతి పొందిన అనుబంధ (గవర్నమెంట్/ ప్రవేట్) పాలిటెక్నికల్ కశాశాలలు
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా కంపార్ట్మెంటల్ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250
ఎంపిక: కామన్ ఎంట్రన్స్ ఆధారంగా
పరీక్ష విధానం: పరీక్ష (POLYCET) 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో పదో తరగతి (S.S.C.) సిలబస్ ప్రకారం ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథ్స్ 60 మార్కులు, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 మార్కులు, బయాలజీ 30 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష 2.30 గంటలు అంటే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుంది.
నోట్: పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కోర్సు చేసే అభ్యర్థులు బయాలజీ తప్ప మిగిలిన సబ్జెక్టులు (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఎంట్రెన్స్ టెస్ట్‌లో అంటెప్ట్ చేయాలి. అదేవిధంగా అగ్రికల్చర్, వెటర్నరీ డిప్లొమా (PJTSAU & PVNRTVU అందించే కోర్సులు)లో అడ్మిషన్ కోసం పరీక్ష రాసే అభ్యర్థులు బయాలజీ (30 మార్కులు) ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది.
POLYCETలో అర్హత మార్కులు
SBTET ద్వారా పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు, వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు తప్పనిసరిగా స్కోర్ చేయాలి.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ప్రారంభం: మే 24, 2021
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 11
లేట్ ఫీజుతో రూ. 100 చివరితేదీ: జూన్ 13
ఆలస్య రుసుము రూ.300తో: జూన్ 15
పరీక్షతేదీ: వెల్లడించాల్సి ఉంది
ఫలితాలు: పరీక్ష నిర్వహించిన 10 రోజుల తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు.
వెబ్సైట్: https://polycetts.nic.in