గురువారం 26 నవంబర్ 2020
Nipuna-education - Oct 01, 2020 , 13:34:44

ఫారెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రిసెర్చ్‌ఫెలో పోస్టులు

ఫారెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రిసెర్చ్‌ఫెలో పోస్టులు

హైదరాబాద్‌: డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌ఆర్‌ఐ) జూన్‌ ప్రాజెక్ట్‌ ఫెలో, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తామని, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో (జేపీఎఫ్‌)-6 పోస్టులు

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌)-1

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-1 పోస్టు

ఫీల్డ్‌ అసిస్టెంట్‌-1 పోస్టు 

అర్హతలు: జేపీఎఫ్‌ పోస్టులకు బాటనీ, ఫారెస్ట్రీ, ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ లేదా ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ చేసి ఉండాలి. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు బాటనీ లేదా బయోడైవర్సిటీ కన్సర్వేషన్‌లో ఎమ్మెసీ పూర్తిచేసి, సంబంధిత విభాగంలో రెండేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు బీఎస్సీ ఫారెస్ట్రీ లేదా అగ్రికల్చర్‌ లేదా డిగ్రీలో బాటనీ చేసి ఉండాలి. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తిచేసి ఉండాలి.  

దరఖాస్తులు: ఆఫ్‌లైన్‌. ఇంటర్వ్యూ రోజు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా దరఖాస్తులకు హాజరుకావాలి.  

ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్‌ 9, 12, 13 తేదీల్లో

పూర్తి వివరాలకు: https://www.icfre.org/