బుధవారం 03 మార్చి 2021
Nipuna-education - Jan 24, 2021 , 12:06:23

241 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌

241 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చే నెల 11 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డాటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టులు ఉన్నాయి. 

మొత్తం పోస్టులు: 241 

ఇందులో డాటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌-116, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌-80, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (స్పెషల్‌ గ్రేడ్‌ 3)-45, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-6, లెక్చరర్‌-1, అసిస్టెంట్‌ డైరెక్టర్‌-1 చొప్పున పోస్టులు ఉన్నాయి. 

అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అభ్యర్థులు 30 ఏండ్లు (జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, డాటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌), 35 ఏండ్లు (అసిస్టెంట్‌ డైరెక్టర్‌, లెక్చరర్‌), 40 ఏండ్లు (గ్రేడ్‌ 3 పోస్టులకు) లోపు వయస్సు కలిగినవారై ఉండాలి. 

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 11

వెబ్‌సైట్‌: http://www.upsconline.nic.in

VIDEOS

logo