గురువారం 22 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 23, 2020 , 16:14:50

ఎన్‌డీఏ, ఎన్ఏ (II) 2019 మార్కులు విడుద‌ల చేసిన యూపీఎస్సీ

ఎన్‌డీఏ, ఎన్ఏ (II) 2019 మార్కులు విడుద‌ల చేసిన యూపీఎస్సీ

న్యూఢిల్లీ: నేష‌నల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ), ఎన్ఏ -2 ప‌రీక్ష 2019లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల  మార్కుల‌ను యూపీఎస్సీ విడుద‌ల చేసింది. ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా చూసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ప‌రీక్ష తుది ఫలితాల‌ను సెప్టెంబ‌ర్ 14న విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో మొత్తం 662 మంది అభ్య‌ర్థులు ఎంపిక‌య్యారు. వీరిని ఆర్మీ, నేవీ, ఎన్‌డీఏలోని ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో నియ‌మించ‌నున్నారు. వీరికి ఇండియ‌న్ ఆర్మీలో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. logo