సోమవారం 03 ఆగస్టు 2020
Nipuna-education - Jul 02, 2020 , 13:54:50

యూపీఎస్సీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, జియో సైంటిస్ట్‌ పరీక్షల వాయిదా

యూపీఎస్సీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, జియో సైంటిస్ట్‌ పరీక్షల వాయిదా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (మెయిన్‌), జియో సైంటిస్ట్‌ (మెయిన్‌) పరీక్షలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వాయిదావేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్టు 8, 9వ తేదీల్లో జరగాల్సి ఉన్నాయి. పరీక్షలకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. పూర్తి వివరాలకు యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 

కరోనా నేపథ్యంలో అభ్యర్థుల కోరికమేరకు యూపీఎస్సీ ఇప్పటికే సీవిల్స్‌ (ప్రిలిమినరీ), ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ) పరీక్ష కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించింది. సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్‌ 4న నిర్వహించనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్ష మే 31న జరగాల్సి ఉన్నది. 


logo