శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nipuna-education - Oct 29, 2020 , 12:47:09

ఆన్‌లైన్‌లో యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు

ఆన్‌లైన్‌లో యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు

న్యూఢిల్లీ: వ‌చ్చే నెల‌లో జ‌రుగ‌నున్న యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుల‌ను ఎన్‌టీఏ విడుద‌ల చేసింది. ప‌రీక్ష రాసే అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ ntanet.nic.inలో హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపింది. ప‌రీక్ష‌లు న‌వంబ‌ర్ 4, 5 తేదీల్లో, 11 నుంచి 13 వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించింది. 

యూజీసీ నెట్ జూన్, సెప్టెంబ‌ర్ సెష‌న్ ప‌రీక్ష‌ల‌ను ఎన్‌టీఏ విడుత‌ల వారీగా నిర్వ‌హిస్తున్న‌ది. సెప్టెంబ‌ర్ 24న ప్రారంభ‌మైన ప‌రీక్ష‌లు న‌వంబ‌ర్ 13తో ముగియ‌నున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సెప్టెంబ‌ర్ 24, 25 తేదీల్లో, అదేనెల 29, 30 తేదీల్లో, అక్టోబ‌ర్ 1, 9, 17 తేదీల్లో ప‌రీక్ష‌లు జ‌రిగాయి. మిగిన ప‌రీక్ష‌ల‌ను వ‌చ్చేనెల‌లో నిర్వ‌హించ‌నున్న‌‌ది.

తాజావార్తలు